రామచంద్రపురం
శివానుగ్రహంతో ప్రజలందరి జీవితాల్లో శాంతి-సౌభాగ్యాలు వెల్లివిరియాలి
మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన మంత్రి వాసంశెట్టి సుభాష్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. జగద్గురు పరమశివుని దివ్య అనుగ్రహం ప్రతి ఇంటిని ఆవహించి,
ప్రజల జీవితాల్లో ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు, ఆనందాలు నిండాలని ఆకాంక్షించారు.
మహాశివరాత్రి భక్తి, త్యాగం, ఆత్మశుద్ధి, ధర్మాచరణకు ప్రతీకగా నిలిచే పవిత్ర పర్వదినమని మంత్రి పేర్కొన్నారు. ఉపవాసం, జాగరణ, రుద్రాభిషేకాలు, శివారాధనల ద్వారా మనోనిగ్రహం సాధించి సత్సంకల్పాలతో ముందుకు సాగేందుకు ఈ మహోత్సవం ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక ప్రేరణనిస్తుందని తెలిపారు.
రాష్ట్రంలోని కార్మికులు సహా సమస్త ప్రజలు శివభక్తితో ఐక్యంగా, సత్సంకల్పంతో జీవిస్తూ సుఖశాంతులతో ఉండాలని,శివానుగ్రహంతో ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి శిఖరాలను అధిరోహించాలని ఈ పవిత్ర సందర్భంగా ప్రార్థిస్తున్నట్లు మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు.
---------------------------
జారీ : PRO to కార్మిక శాఖ మాత్యులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వo
