అమలాపురం ఫిబ్రవరి 15: జిల్లాస్థాయిలో ప్రజా సమ స్యల పరిష్కార వేదిక కార్యక్రమం ఈనెల 16వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలు నుంచి మధ్యా హ్నం 1 గంట వరకు కలెక్టరేట్ గోదావరి భవన్ నందు యధావిధిగా నిర్వ హించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు
1100 కాల్ సెంటర్, ఆన్లైన్ సేవలను వినియోగించు కొని అర్జీల పరిష్కార స్థితిగతులను తెలుసుకొన వచ్చునన్నారు.అర్జీదారులు తమ సమస్య గురించి
ఖచ్చితమైన పూర్తి వివరా లతో దరఖాస్తు చేయాలని సూచించారు. అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరిస్తారని తెలిపారు. సమస్యకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన అర్జీని
సమర్పించాలని,గతంలో ఫిర్యాదు చేసిన వారు తప్పనిసరిగా పాత అర్జీ రసీదు తీసుకురావాలని సూచించారు. అర్జీలో పేరు, చిరునామా మరియు ఫోన్ నంబర్ స్పష్టంగా నమోదు చేయాలని తెలిపారు అర్జీదారులు తమ ఫిర్యా దు స్థితిగతులను తెలుసు కునేందుకు ప్రభుత్వం పలు డిజిటల్ సౌకర్యాలను కల్పించిందని జిల్లా కలెక్టర్ తెలిపారు సమస్య పరి ష్కారమైన వెంటనే అర్జీ దారుని ఫోన్ నంబర్కు మెసేజ్ అలర్ట్ వస్తుంద న్నారు. నోటీసులు, ఎండార్స్మెంట్లు వాట్సాప్ ద్వారా పంపడం జరుగు తుందన్నారు.జిల్లా కేంద్రం తో పాటు అన్ని డివిజన్ మండల కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాల్లో కూడా పీజీఆర్ఎస్ జరుగు తుందన్నారు. అర్జీదారులు తమ సమీప కేంద్రాల్లో కూ డా ఫిర్యాదు చేయవచ్చున న్నారు.మీ కోసం 1100 కాల్ సెంటర్ అర్జీదారులు కలెక్టరేట్కు రాకుండానే తమ సమస్యలను నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం కల్పించిన 1100 టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదిం చ వచ్చునని జిల్లా కలెక్టర్ సూచించారు. గతంలో ఇచ్చిన అర్జీల స్టేటస్ తెలుసుకోవడానికి కూడా ఈ నంబర్కు కాల్ చేయవ చ్చునని, అలాగే,వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో కూడా అర్జీలను సమర్పించవ చ్చునని సూచించారు. జిల్లా ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ సమస్యల కు సత్వర పరిష్కారం పొందాలని విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ప్రతి సోమవారం ఉదయం 10.00 గంటలకు రెవెన్యూ క్లినిక్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ముగ్గురు రెవెన్యూ డివిజనల్ అధికారులు, మండల తహసీల్దార్లు తప్పనిసరిగా ఉదయం 10.00 గంటలకు కలెక్టరేట్లో నిర్వహించే రెవెన్యూ క్లిని క్కు హాజరై వినతులను స్వీకరిస్తారని తెలిపారు.
అలాగే ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తు లు స్వీకరించేందుకు సంబంధిత ఏఓ, డీటీ లు అందుబాటులో ఉంటారని తెలిపారు. తహసీల్దార్ కార్యాలయాల్లో నిర్వహిం చే రెవెన్యూ క్లినిక్కు మండల సర్వేయర్లు, రెవెన్యూ ఇన్ స్పెక్టర్లు,
గ్రామ రెవెన్యూ అధి కారులు తమకు సంబంధించిన అన్ని రికార్డులతో తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు. రైతులు భూసంబంధిత సమస్యలు, రెవెన్యూ సమస్యలను ఈ రెవెన్యూ క్లినిక్ ద్వారా పరిష్కరించుకునే అవకా శాన్ని సద్వినియోగం చేసు కోవాలని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
