అమలాపురం పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయం వద్ద గౌరవ అమలాపురం శాసనసభ్యులు శ్రీ అయితాబత్తుల ఆనందరావు గారి ఆధ్వర్యంలో గురువారం 'ప్రజాదర్బార్' కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండి తరలివచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే గారికి విన్నవించుకున్నారు. ఈ ప్రజాదర్బార్‌లో ప్రజల నుండి మొత్తం 76 అర్జీలు స్వీకరించడం జరిగింది. ప్రధానంగా పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల పట్టాలు మరియు స్థానిక మౌలిక వసతుల గురించి ప్రజలు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.. వచ్చిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరితగతిన సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. కూటమి ప్రభుత్వం ప్రజల కష్టాలను తీర్చడానికే పని చేస్తోందని, ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా ప్రతి ఫిర్యాదుపై తగిన చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఈ ప్రజాదర్బార్ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
.jpeg)