ఆలమూరులో పండుగ వాతావరణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం

 


వైభవంగా వేడుకలు – వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు, రోగులకు పండ్లు, పేదలకు బట్టల పంపిణీ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజకవర్గం మండల కేంద్రమైన ఆలమూరు గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. ఆలమూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్, చెముడు లంక సర్పంచ్ తమన శీను ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జాతీయ అవార్డు గ్రహీత ప్రముఖ పారిశ్రామికవేత్త వైసిపి సీనియర్ నాయకులు రాష్ట్ర కాపు సంఘం ట్రెజరర్  అంబేద్కర్ కోనసీమ జిల్లా కాపు సంఘం అధ్యక్షులు, సేవా ప్రతులు డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు పేదలకు వస్త్ర దానం చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ, డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ప్రజల సంక్షేమం కోసం అమలు చేసిన పథకాలు ఇప్పటికీ ప్రజల హృదయాల్లో నిలిచాయని పేర్కొన్నారు. అనంతరం ఆలమూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేయడంతో పాటు పేదవారికి బట్టలు అందజేశారు. మార్చి 13న నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆవిర్భావ దినోత్సవాన్ని ఒక పండుగలా జరుపుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డీ నాయకత్వంలో జరిగిన పరిపాలన ప్రజలకు ఎంతో మేలు చేసిందని అన్నారు. సంక్షేమ పథకాల ద్వారా పేదలు, రైతులు, మహిళలు మరియు విద్యార్థులకు అందించిన సహాయం ప్రజల మన్ననలు పొందిందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ప్రజల ఆశీర్వాదాలతో మళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజా సంక్షేమ పాలన కొనసాగిస్తుందనే నమ్మకం తమకు ఉందని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపి సీనియర్ నాయకులు, ప్రముఖ పారిశ్రామికవేత్త, జాతీయ అవార్డు గ్రహీత రాష్ట్ర కాపు సంఘం ట్రెజరర్ కోనసీమ జిల్లా కాపు సంఘం అధ్యక్షులు, సేవా ప్రతులు,డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు,రాష్ట్ర మేధావుల వర్గం కార్యదర్శి కొడమంచలి హరీష్,ఎంపీపీ తోరటి లక్ష్మణ రావు వైస్ ఎంపీపీ దుర్గ భవాని సాయి బాబు,నానాజీ, ఆలమూరు సర్పంచ్ నేలపాటి లావణ్య కుమార్ రాజా,  ఉప సర్పంచ్ చల్ల లక్ష్మీభూషణం,నెక్కంటి బుజ్జి, నామాల శ్రీను,మెంబర్లు బూరయ్య, యనమదల నాగేశ్వరరావు,లంకె వెంకట రెడ్డి,గణేష్, కొప్పనతి శ్రీను, నాయుడు ప్రసాద్, గంధం చంద్రం, అనుసూరి మణికంఠ, తోరటీ రాంబాబు,నాగమోహన్ రెడ్డి, ,తోరాటీ గోవింద్, పాలింగి ఉమా, మోటీపిల్లి వెంకన్న, కటారి గంగయ్య, సుధాకర్, , నెల్లి రాజు, లోవరాజు, గుత్తుల జయరాజు, గుత్తుల శ్రీను, గోపీనాగు, చల్లా సుబ్బయ్య,ఆనం వెంకన్న,వైసీపీ ఆలమూరు మండల నాయకులు,అభిమానులు పాల్గొన్నారు