రాత్రిపూట ఇంటి దొంగతనాలు చేసి విలువైన వస్తువులు దొంగిలిచడమే వీరి పని,

 


రాత్రిపూట ఇంటి తలుపులకి వేసిన తాళాలు బద్దలకొట్టి కన్నపు నేరాలు చేసే దొంగలును అరెస్ట్ చేసిన పోలీసులుఈ సందర్బంగా సోమవారం జిల్లా ఎస్పీ రాహుల్ మీనా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు  జిల్లా ఎస్పీ రాహుల్ మీనా మాట్లాడుతూ గత నెలలో  ఆలమూరు మండలానికి చెందిన జుత్తుక లక్ష్ని పార్వతి పిర్యాదు చేశారాని  ఈ మేరకు  కేసు దర్యాప్తు చేసి ముగ్గురు ముద్దాయిని అరెస్ట్ చేశామని తెలిపారు అరెస్టు కాబడిన ముద్దాయిలు వివరాలు  ఆలమూరు కు చెందిన 1. కంచేర్ల జార్జ్ బెన్నీ . 2. సన్నపు శ్రీ చరణ్ 3. ఉందుర్తి ఆనంద్ కుమార్  రాత్రిపూట ఇంటి దొంగతనాలు చేసి విలువైన వస్తువులు దొంగిలిచడమే  వీరి పని, వీళ్ళుపై గంజాయి కేసులు కూడా ఉన్నాయని తెలిపారు వీరి వద్ద నుండి 203.650 గ్రాములు  బంగారం వస్తువులు వెండి 765 గ్రాములు మొత్తం విలువ 32,40,000/- రూపాయలు అన్నారు