పత్రిక ప్రచురణ/ ప్రసార నిమిత్తము: గూడూరు, కోడుమూరు మండలాల్లో ఆప్టా విస్తృతంగాసభ్యత్వ నమోదు.

 


నేడు ఎ పి ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (ఆప్టా) రాష్ట్ర అధ్యక్షుడు కాకి ప్రకాష్ రావు నాయకత్వం లో ఎ పి ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ ( ఆప్టా) సభ్యత్వ నమోదు కార్యక్రమం పెంచికలపాడు, గుడిపాడు, గూడూరు, పులకుర్తి, కల్లాపరి మొదలైన గ్రామాల యందు వున్న ఉన్నత పాఠశాల లు మరియు ప్రాథమిక పాఠశాల ల యందు పని చేయుచున్న ఉపాధ్యాయ ఉపాధ్యాయి నులచే నమోదు చేయడం జరిగింది.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు కాకి ప్రకాష్ రావు ఆయా పాఠశాల ల ఉపాద్యాయుల యొక్క సమస్య లను అడిగి తెలుసుకోవడం జరిగింది. వారి యొక్క సమస్య ల పై ఉన్నత అధికారులను ఫోన్ యందు సంప్రదించి అప్పటికప్పుడు పరిష్కారం చేయడం జరిగింది. గూడూరు మండలం మరియు కోడుమూరు మండలంలో జరిగిన ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం లో ఎ పి ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (ఆప్టా) రాష్ట్ర అధ్యక్షుడు కాకి ప్రకాష్ రావు, రాష్ట్ర గౌరవ సలహాదారుడు పి రాజసాగర్, కర్నూలు జిల్లా అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, కోడుమూరు మండల అధ్యక్షుడు ప్రసాద్, గూడూరు మండలం అధ్యక్షుడు బేగ్ మరియు కర్నూలు మండల అధ్యక్షుడు నాగార్జున పాల్గొన్నారు.