డా. బోనం కనకదుర్గకు ప్రతిష్ఠాత్మక "మహిళా కీర్తి రత్న - ఉమెన్ ఎక్సలెన్స్ అవార్డు" ప్రదానం
ఓడలరేవు లోని బీవీసీ ఇంజినీరింగ్ కళాశాల చైర్‌పర్సన్ డా. బోనం కనకదుర్గ ప్రతిష్ఠాత్మకమైన “మహిళా కీర్తి రత్న – ఉమెన్ ఎక్సలెన్స్ అవార్డు” అందుకున్నారు. మంగళవారం విజయవాడ బెంజి సర్కిల్‌లోని సర్వోత్తమ గ్రంధాలయ ఆడిటోరియంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆమెను ఈ జాతీయ పురస్కారంతో ఘనంగా సన్మానించారు.
శ్రీశ్రీ కళావేదిక, సవ్యసాచి గ్రూప్ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో, వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన మహిళలను గుర్తించి ఈ పురస్కారాలు అందజేశారు. సాంకేతిక విద్యా రంగంలో డా. బోనం కనకదుర్గ కనబరిచిన ప్రతిభ, నిబద్ధత, సమాజ హితం కోసం ఆమె చేస్తున్న సేవలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
ప్రముఖుల సమక్షంలో ఘన సన్మానం
ఈ అవార్డు ప్రదానోత్సవంలో కేంద్ర ప్రభుత్వ సంగీత నాటక అకాడమీ సభ్యురాలు, నాట్య గురువు డా. ఎస్పీ భారతి, జీ. ఈశ్వరీ భూషణం, కత్తిమండ ప్రతాప్ తదితర ప్రముఖులు పాల్గొని డా. కనకదుర్గను సన్మానించి అవార్డును అందజేశారు.
మహిళా శక్తికి గుర్తింపు
పురస్కారాన్ని స్వీకరించిన అనంతరం డా. బోనం కనకదుర్గ మాట్లాడుతూ.. "ఈ గౌరవం ప్రతి మహిళా కృషికి దక్కిన గుర్తింపు. మహిళా శక్తి వికాసం కోసం, సమాజాభివృద్ధి కోసం నా వంతు కృషి నిరంతరం కొనసాగుతుంది" అని పేర్కొన్నారు. బీవీసీ విద్యాసంస్థల అధినేత బోనం కనకయ్య స్పందిస్తూ, ఈ పురస్కారం తమ సంస్థకు గర్వకారణమని, మహిళా సాధికారతకు ఇది ఒక గొప్ప ప్రేరణ అని కొనియాడారు.
హర్షం వ్యక్తం చేసిన కళాశాల వర్గాలు:డా. కనకదుర్గకు ఈ అవార్డు దక్కడం పట్ల బీవీసీ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డా. డి. మహేశ్వర్, వైస్ ప్రిన్సిపాల్ డా. ఆకుల ప్రవీణ్, ఏ.వో. ఏ.వై.ఆర్.వి. ప్రసాద్, వివిధ విభాగాల హెచ్‌వోడీలు, సిబ్బంది, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.
