కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పదోన్నతి పొందిన వైఖోమ్ నిడియా దేవి గురువారం జిల్లా కేంద్రమైన అమలాపురంలోని కలెక్టరేట్‌లో అధికారికంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. పదవి బాధ్యతలు స్వీకరించిన అనంతరం, జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నిడియా దేవి జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ ను మర్యాదపూర్వకoగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆమెకు పుష్పగుచ్ఛం అందించి, శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా అభివృద్ధిలో మరియు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో జాయింట్ కలెక్టర్ కీలక పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు. నూతన జిల్లా జాయింట్ కలెక్టర్‌ను జిల్లా స్థాయి అధికారులు మరియు కలెక్టరేట్ సిబ్బంది కలిసి ఘనంగా స్వాగతం పలికారు. వివిధ శాఖల అధికారులు ఆమెకు పుష్పగుచ్ఛాలతో అభినందనలు తెలిపారు. జిల్లా పాలనలో తమ వంతు సహకారాన్ని అందిస్తామని అధికారులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. జాయింట్ కలెక్టర్ తమ స్పందన తెలుపుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. జిల్లా కలెక్టర్ వారి మార్గదర్శకత్వంలో, జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా చూస్తానని, పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని ఆమె హామీ ఇచ్చారు. జిల్లా అధికారులందరి సమన్వయంతో జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని ధీమా వ్యక్తం చేశారు.