-ఎంపీడీఓ ఎ రాజు
ఎన్ఆర్జిఎస్ రోడ్డు పనుల పరిశీలన గ్రామాభివృద్ధికి హౌస్ టాక్స్ సకాలంలో చెల్లించాలి:
డా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజక వర్గం,ఆలమూరు సోమవారం పెద్దపళ్ల గ్రామంలో ఎనర్జీఎస్ నిధులతో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులను ఎంపీడీవో ఎ. రాజు పరిశీలించారు. పనుల పురోగతిని దగ్గరుండి పరిశీలించిన ఆయన, పనులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా కొనసాగాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, అందులో భాగంగానే ఈ రోడ్డు నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ పెద్దపల్లి, నర్సిపూడి, చొప్పళ్ల తదితర గ్రామాల ప్రజలు హౌస్ టాక్స్‌ను సకాలంలో చెల్లించి గ్రామాభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇళ్లతో పాటు వాణిజ్యదుకాణాల యజమానులు కూడా తమ పన్నులు నిర్దిష్ట గడువులోగా చెల్లించాలన్నారు. పన్నుల రూపంలో వచ్చే ఆదాయం గ్రామాల్లో రహదారులు, పారిశుద్ధ్యం, తాగునీరు, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి వినియోగించబడుతుందని వివరించారు.గ్రామాభివృద్ధి కార్యక్రమాలు సాఫీగా కొనసాగాలంటే ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులకు గ్రామస్తుల పూర్తి సహకారం ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, కార్యదర్శి, సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
.jpeg)
.jpeg)
