ఘనంగా శ్రీ విజయ దుర్గా అమ్మవారి దసరా వేడుకలు

రౌతులపూడి :

ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం పల్లపు సావరం గ్రామ సర్పంచ్ నందమూరి రాజా పర్యవేక్షణ లో ఆలయ అర్చకులు ఆకొండి వెంకట శాస్త్రి ఆధ్వర్యంలో పల్లపు సావరం లో వేంచేసి ఉన్న  శ్రీ విజయ దుర్గా అమ్మవారి  దసరా వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి .ఇందులో భాగంగా ఈ రోజు మహలక్ష్మి అలంకరణ పురస్కరించుకుని  పల్లపు సావరం గ్రామానికి చెందిన అమ్మ భక్తుడు సిద్దాబత్తుల శ్రీను అమ్మవారికి సుమారు లక్ష యాభై వేల రూపాయల తో అమ్మవారికి అలంకరణ చేశారు.అనంతరం గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ అమ్మవారికి నిత్యం కుంకుమ పూజలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.కావున భక్తులు అందరూ అమ్మవారి కుంకుమ పూజ కార్యక్రమంలో పాల్గొని అమ్మ దయకు పాత్రులు కాగలరు అని తెలిపారు.