మండపేట :
నియోజకవర్గంలోని ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పేర్కొన్నారు. మండపేట పట్టణం 12వ వార్డులో మున్సిపల్ నిధులు రూ.83.50 లక్షలతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను ఎమ్మెల్యే వేగుళ్ళ ఆదివారం ప్రారంభించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ కమ్యూనిటీ హాల్స్ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. కూటమి ప్రభుతం వచ్చాక ప్రతీ ఒక్కరికీ మేలు చేస్తున్నారని అన్నారు. రెండేళ్లలో ఎక్కడికక్కడ అభివృద్ధి పనులు ఊపందుకున్నాయని, రాబోయే రోజుల్లో మరింత ఉదృతంగా అభివృద్ధి పనులు చేపడతామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు మత్స నాగు, మాజీ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు, మండపేట మార్కెట్ కమిటీ చైర్మన్ చింతపల్లి రామకృష్ణ, మల్లిపూడి గణేశ్వరరావు, బీజేపీ నాయకులు కోన సత్యనారాయణ, కోటిపల్లి సాయిరాం, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పిల్లి గణేష్, శిరంగి ఈశ్వరరావు, యరమాటి గంగరాజు, కొవ్వాడ అప్పన్నబాబు, పలివెల వెంకన్న, పాలచర్ల వెంకన్నబాబు, పాలచర్ల శిరీష్, బోళ్ల అమ్మిరాజు, యరమాటి సత్యనారాయణ, గుండు తాతరాజు, మలసాని సీతామహాలక్ష్మి, గ్రంధి శ్రీనివాస్, చిట్టూరి సతీష్, పాలచర్ల బ్రహ్మాజీ, బోళ్ళ సత్తిబాబు, వేగుళ్ళ భాస్కరరావు, కనపర్తి సుబ్రహ్మణ్యం, పొలిమాటి ఆనంద్ బాబు, చుండ్రు రామకృష్ణ, మున్సిపల్ డి.ఇ శ్రీనివాస్, ఎ.ఇ లు తదితరులు పాల్గొన్నారు.