ఏలూరు జిల్లాలో కొనసాగుతున్న డీజిల్ కొరత అనే అంశం



 ఏలూరు జిల్లాలో కొనసాగుతున్న డీజిల్ కొరత అనే అంశం కేవలం కల్పితమైందని డీజిల్ కు ఎటువంటి కొరత లేదని ఒకసారిగా వాహనదారులు పెట్రోల్ బంకులకు చేరుకుని డీజిల్ కొట్టించుకోవడం వల్లే పెట్రోల్ బంకుల్లో డీజిల్ డ్రై ఔట్లు కొనసాగుతున్నాయని ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ తెలిపారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు వల్లే ఇలా జరుగుతుందని ఇటువంటి వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు చేపడతామని కూడా ఆయన హెచ్చరించారు ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఇప్పటికే జిల్లా అధికారులతో సమీక్ష జరిపి దాదాపు 65 బంకుల్లో పెట్రోల్ డీజిల్ నిలవాలని తిరిగి పునరుద్ధరిస్తున్నామని ఆయన తెలిపారు