మండలంలోని పెట్రోల్ బంక్ లలో తక్షణం డీజిల్, పెట్రోలు కొరత లేకుండా చూడాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ కామన ప్రభాకరరావు జిల్లా కలెక్టర్, మరియు జిల్లా సివిల్ సప్లయ్ అధికారులు

 తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం ,మండపేట టౌన్, మండపేట రూరల్ మండలం, రాయవరం, కపిలేశ్వరపురం మండలంలోని పెట్రోల్ బంక్ లలో తక్షణం డీజిల్, పెట్రోలు కొరత లేకుండా చూడాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ కామన ప్రభాకరరావు జిల్లా కలెక్టర్, మరియు జిల్లా సివిల్ సప్లయ్ అధికారులు కు శనివారం మండపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కామన మాట్లాడుతూ  నియోజకవర్గంలో   డీజిల్ కొరత తీవ్రంగా మారడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పలు పెట్రోల్ బంక్‌ల వద్ద డీజిల్ అందుబాటులో లేకపోవడంతో వాహనదారులు గంటల తరబడి క్యూలలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది.  ముఖ్యంగా రైతులు పంట కోతల సమయంలో డీజిల్ లేక కోతలు జరగకుండా ఇబ్బందులు పడుతున్నారు అని,ఆటో డ్రైవర్లు, చిన్న వ్యాపారులు ఈ సమస్యతో తీవ్రంగా ప్రభావితమవుతున్నారు.* వ్యవసాయ పనులకు అవసరమైన డీజిల్ అందకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.* పంటల సాగు, నీటి పంపింగ్ పనులు ఆలస్యం అవుతున్నాయి ఆవేదన చేస్తున్నారు.* మరోవైపు ఆటో, రవాణా వాహనాల డ్రైవర్లు డీజిల్ కోసం గంటల పాటు వేచి ఉండాల్సి రావడంతో వారి దినసరి ఆదాయం దెబ్బతింటోంది.* కొన్ని ప్రాంతాల్లో డీజిల్ సరఫరా పరిమితంగా ఉండటం, సరైన సమయానికి రాకపోవడం ఈ సమస్యకు కారణంగా తెలుస్తోంది. * డీజిల్ కోసం బంక్‌ల వద్ద వాటర్ క్యాన్లు పెద్ద పెద్ద డ్రమ్ములతో నిలబడిన ప్రజల దృశ్యాలు కనిపిస్తున్నాయి.*  పరిస్థితి మరింత విషమించకముందే అధికారులు తక్షణ చర్యలు తీసుకుని సరఫరా సాధారణ స్థితికి తీసుకురావాలని , అధికారులు తప్పుడు ప్రకటనలు చేస్తూ ఎక్కడా కొరత లేదని చెప్పడం వింతగా ఉందని కామన తీవ్రం గా విమర్శలు చేశారు. కేక్షస్థాయిలో అధికారులను పంపి ప్రతి రోజూ నివేదిక లు తీసుకోవాలని, ప్రతి పెట్రోలు కంపెనీ లోతు మానిటరింగ్ చేస్తూ రైతులు కు, వాహనదారు లకు డీజిల్, పెట్రోలు కొరత లేకుండా చూడాలని కామన డిమాండ్ చేశారు.
ఈ సమస్యపై సంబంధిత అధికారులుకు తాను ఫోన్ చేసి తెలిపానని , రాష్ట్ర సివిల్ సప్లయ్ కమిషనర్ శ్రీ కన్న బాబు దృష్టికి తీసుకొనివెళ్ళడం జరిగినది అని పేర్కొన్నారు. తక్షణం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా అధికారులు రంగంలోకి దిగి ఆదుకోవాలని కామన డిమాండ్ చేశారు.