కాకినాడ, మార్చి 03, 2026.
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్పీఎస్) వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ.. మంగళవారం కాకినాడ కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. సామర్లకోట మండలం, వేట్లపాలెం బాణాసంచా తయారీ ఘటనలో 22 మంది మృతి చెందడం అత్యంత బాధాకరమని, మృతి చెందిన బాధితులకు అండగా నిలిచి ఆదుకోవాలని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యసేవలు అందించడంతోపాటు మృతుల కుటుంబీకులకు ఉపాధి, పింఛను సదుపాయాలు కల్పించాలని కోరుతూ ఈ సందర్భంగా కృష్ణ మాదిగ జిల్లా కలెక్టర్ కు వినత పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ.. జిల్లా అధికారయంత్రం బాధిత కుటుంబాలకు అండగా నిలిచి అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు ముమ్మిడివరపు చిన్న సుబ్బారావు, డోకుబుర్ర భద్రం మాస్టారు, కొండేపూడి ఉదయ్ కుమార్, పసుపులేటి చిన్నబాబు, సిద్ధాంతపు బెన్ జాన్సన్, అనంతపురం రాజు, పలివెల నవీన్, తుమ్మలపల్లి సంతోష్ కుమార్, పాలపాటి శ్రీను తదితరులు పాల్గొన్నారు.
