చంద్రగ్రహణం:
మన కాలచక్రంలో ఫాల్గుణ మాసం అత్యంత విశిష్టమైన స్థానాన్ని ఆక్రమించింది. ఇది ఋతువులు సంధి కాలం. చలి తీవ్రతతో కూడిన శిశిర ఋతువు మెల్లగా నిష్క్రమిస్తూ, నూతన ఉత్తేజాన్ని నింపే వసంత ఋతువుకు స్వాగతం పలికే సుందర సమయం ఇది. ప్రకృతి మాత తన పురాతన పత్రాలను రాల్చి, పచ్చని చిగురులతో, రంగురంగుల పుష్పాలతో నూతన శోభను సంతరించుకునే ఈ కాలం, మానవ మనస్సులలో కూడా నూతన ఉల్లాసాన్ని నింపుతుంది. అటువంటి హోలీ రోజున ఈసారి చంద్రగ్రహణం సంభవిస్తోంది.
తేదీ: మార్చి 3, 2026 (మంగళవారం)
గ్రహణ స్పర్శ (ఆరంభం) : మ. 03:21
గ్రహణ మధ్యకాలం : సా. 05:04
చంద్రోదయం (Hyd) : సా. 06:22
గ్రహణ మోక్షం (విడుపు) : సా. 06:47
