స్పెషల్ ఇంటెన్షవ్ రివిజన్.... (SIR) రాష్ట్ర కన్వీనర్ గా నల్లమిల్లి...



 శుభాకాంక్షలు తెలిపిన కోన సత్యనారాయణ బీజేపీ సీనియర్ నాయకులు... 


రిపోర్టర్ స్వామి...

కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న SIR ( స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్ గా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు బిజెపి జాతీయ అధిష్టానం ప్రకటన జారీ చేసింది.బిజెపి జాతీయ అధ్యక్షులు నితిన్ నవీన్ అధ్యక్షతన ఢిల్లీలోని బిజెపి నేషనల్ ఆఫీసు నందు ఈనెల 7వ తేదీన జరిగే సమావేశానికి హాజరు కావలసిందిగా ఎమ్మెల్యే నల్లమిల్లిని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్  ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఐదుగురు సభ్యులు ఉండే ఈ కమిటీకి ఎమ్మెల్యే నల్లమిల్లి కన్వీనర్ గా వ్యవహరిస్తారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి జాతీయ బిజెపి నిర్దేశించే ప్రతీ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా పాటించే ఎమ్మెల్యే నల్లమిల్లి పనితీరు పట్ల ఆకర్షితులైన బిజెపి అధిష్టానం ఆయనకు ఇప్పటికే పార్టీలో మంచి ప్రాధాన్యతిస్తూ వస్తుంది. ఇప్పుడు జాతీయస్థాయిలో కీలక కమిటీలలో కూడా ఎమ్మెల్యే నల్లమిల్లికి స్థానం ఇచ్చి గౌరవించడం విశేషంఅని బీజేపీ సీనియర్ నాయకులు  కోన సత్యనారాయణ అన్నారు...