● ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన IDBI Bank జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (JAM) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకు శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఈ నియామకాల ద్వారా భర్తీ చేయనున్నారు.ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 1100 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు ప్రారంభ తేదీ : 08 మార్చి 2026
దరఖాస్తు చివరి తేదీ : 19 మార్చి 2026
● ఆన్‌లైన్ పరీక్ష (తాత్కాలికంగా ): 12 ఏప్రిల్ 2026
మొత్తం ఖాళీలు
● జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ( JAM) – 1100 పోస్టులు
విద్యార్హత
● గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
● జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు సాధారణంగా 60% మార్కులు, ఎస్సీ / ఎస్టీ / పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 55% మార్కులు అవసరం.
వయస్సు పరిమితి
● కనిష్ట వయస్సు: 20 సంవత్సరాలు
● గరిష్ట వయస్సు: 25 సంవత్సరాలు
● రిజర్వేషన్ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.
వేతనం (Salary)
● ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభంలో శిక్షణ కాలంలో సుమారు నెలకు ₹36,000 నుండి ₹40,000 వరకు స్టైపెండ్ ఇవ్వబడుతుంది.
శిక్షణ పూర్తయ్యాక సుమారు ₹6 లక్షల నుండి ₹7 లక్షల వరకు వార్షిక ప్యాకేజీ (CTC) అందుతుంది.
● బ్యాంకు నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు, ప్రయోజనాలు కూడా అందిస్తారు.
దరఖాస్తు ఫీజు
● SC / ST / PwBD అభ్యర్థులకు – ₹250
● ఇతర అభ్యర్థులకు – ₹1050
ఎంపిక విధానం
● ఆన్‌లైన్ పరీక్ష
● డాక్యుమెంట్ వెరిఫికేషన్
● వ్యక్తిగత ఇంటర్వ్యూ
● మెడికల్ టెస్ట్
దరఖాస్తు విధానం
● ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
● దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవాలని అధికారులు సూచించారు.
