*దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం అన్నివిధాలా చేయూతనందిస్తుంది..*
*కొత్తపేటలో దివ్యాంగ శక్తి పథకం ప్రారంభంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు...*
*దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు...*
దివ్యాంగులను అన్ని విధాల ఆదుకోవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. దివ్యాంగ శక్తి పేరుతో ప్రభుత్వం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించే పథకాన్ని కొత్తపేటలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మరియు బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి అనంతకుమారి తో కలిసి ప్రారంభించారు. ముందుగా వారితో కలిసి బస్సులో ప్రయాణించారు అనంతరం దివ్యాంగులకు భోజనం వడ్డించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దివ్యాంగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తుందన్నారు. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు స్త్రీశక్తి పథకం కింద ఉచిత ప్రయాణం కల్పిస్తుండగా, ఇప్పుడు దివ్యాంగులు ఉచిత ప్రయాణం చేయవచ్చన్నారు.40 శాతం, అంతకంటే ఎక్కువ శాతం వైకల్యం ఉన్న దివ్యాంగులకు ఉచిత ప్రయాణం వర్తిస్తుందన్నారు. గత ఏడాది డిసెంబరు 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు.. వారికి ఇంద్రధనస్సు పేరిట ఆరు పథకాలు ప్రకటించారన్నారు.అందులో ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కూడా ఒకటన్నారు. కేవలం రెండు నెలల్లోనే ఇచ్చిన హామీని అమలుల్లోకి తీసుకువచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకి దక్కుతుందన్నారు. ఈ పథకంతో రాష్ట్రంలో 11 లక్షల మంది దివ్యాంగులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. దివ్యాంగులకు మొదటి నుంచి టీడీపీనే ప్రాధాన్యత ఇస్తుందనీ, దివ్యాంగుల సంక్షేమానికి, ఆత్మగౌరవానికి ప్రాధాన్యత ఇచ్చిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదన్నారు. టీడీపీ దివ్యాంగుల కోసం అమలుచేసిన ప్రత్యేక పథకాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. టీడీపీ ప్రభుత్వం అన్ని వర్గాలకు అమలు చేసినట్లే దివ్యాంగులకూ ప్రత్యేక రాయితీ రుణాలు పథకం అమలు చేసిందన్నారు. దివ్యాంగుల సంక్షేమ శాఖ ద్వారా టీడీపీ అమలు చేసిన రాయితీ రుణాలు మంజూరు ప్రక్రియను జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే నిలిపివేశారనీ, ఈ నిర్ణయం దివ్యాంగుల్లో తీవ్ర అసంతృప్తిని నింపిందన్నారు.టీడీపీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి రాగానే 40 శాతం నుంచి 79 శాతం వరకు వైకల్యం ఉన్న దివ్యాంగులకు అప్పటివరకు అందుతున్న రూ.500 పింఛన్ రూ. 1000కి పెంచిందనీ, 90 శాతం అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారికి రూ.1500 చేసిందనీ 2019లో 79 శాతం లోపు వైకల్యం ఉన్న వారికి రూ.2 వేలు, అంతకంటే ఎక్కువ ఉన్న వారికి రూ.3 వేలు చొప్పున అందించిందన్నారు.ఇలా ఐదేళ్ల వ్యవధిలో దివ్యాంగుల పింఛన్ మొత్తా రూ.500 నుంచి రూ.2వేలు, రూ.3వేలకు పెంచడంతో కొందరికి 300 శాతం, మరికొందరికి 500 శాతం లబ్ధి చేకూరిందన్నారు.2019 జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే వైకల్య శాతంతో పని లేకుండా పింఛన్ అందరకీ ఒకేలా చేసి దివ్యాంగుల సంక్షేమం గాలికి వదిలేసిందన్నారు. మరలా
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దివ్యాంగుల పింఛన్ ను రూ.3 వేల నుంచి రూ.6వేలకు పెంచిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి దక్కిందన్నారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
