రెడ్డి బాబుకు జిల్లా ప్రెస్ క్లబ్ రూ.10 వేలు ఆర్థిక సహాయం

అమలాపురం  మార్చి 18: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పి.నాగ శ్రీనివాసరావు అధ్యక్షతన జిల్లా ప్రెస్ క్లబ్ సమావేశం బుధవారం అమలాపురం సర్ అర్ధర్ కాటన్ జిల్లా పరిషత్ అతిథి గృహంలో జరిగింది. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ గౌరవాధ్యక్షులు డాక్టర్ కె.వి.రామారావు మాట్లాడుతూ రాబోయే రోజులలో ప్రెస్ క్లబ్ సభ్యులు తరపున చేయవలసిన సంక్షేమ సేవా కార్యక్రమాలు, పాటించవలసిన నియమ నిబంధనలు, జిల్లా ప్రెస్ క్లబ్ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం తదితర అంశాలపై ప్రెస్ క్లబ్ సభ్యులందరూ కృషి చేయాలని సూచించారు.ప్రెస్ క్లబ్ గౌరాధ్యక్షులు రెడ్డి బాబు ఇటీవల గుండెపోటుకు గురై చికిత్స పొంది,ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న సందర్భంగా ఆయనకు అమలాపురం లో జిల్లా ప్రెస్ క్లబ్ తరఫున ఆర్థిక సహాయాన్ని మందులు ఖర్చులకు గాను అందజేశారు. ఈ సందర్భంగా ఆయనకు జిల్లా ప్రెస్ క్లబ్ అమలాపురం తరపున సాలువతో సత్కరించి, రూ.10వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రెస్ క్లబ్ సభ్యులు చేతుల మీదుగా అందజేయడం జరిగింది.ఈ సమావేశంలో జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పి. నాగ శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ మూర్తి, గౌరవాధ్యక్షులు డాక్టర్ కె.వి.రామారావు, జాయింట్ సెక్రెటరీ దేవ్ మహేష్, ట్రెజరర్ గోకర కొండ పద్మరాజు,పోలిశెట్టి బాబులు ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.