జ్యోతిరావు పూలే ద్వి శత జయంతి అధికారికంగా జరపాలి... బీసీల డిమాండ్.....

         


జ్యోతిరావు పూలే ద్వి శత జయంతి రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా జరపాలని జాతీయ బిసి సంఘాల నాయకులు విరమల్లు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. జాతీయ బీసీ సంఘం మండపేట శాఖ ఆధ్వర్యంలో ఆదివారం కామాక్షి కళ్యాణ మండపం లో  సమావేశం  జరిగింది. ఈ సందర్భంగా బిసి నాయకులు మాట్లాడుతూ ఈ సమావేశంలో ముఖ్య ఉద్దేశం వచ్చే నెల ఏప్రిల్ 11 తేదీన మహాత్మా జ్యోతిరావు పూలే ద్విశత జయంతి మహోత్సవం భారీ ఎత్తున జరపాలని  నిర్ణయించినట్లు తెలిపారు. ఆధునిక భారతదేశంలో పెత్తందారు వ్యవస్థ మీద తిరుగుబాటు చేసిన మహోన్నత వ్యక్తి జ్యోతి రావు పూలే అన్నారు.  ద్వి శత జయంతి రాష్ట్రవ్యాప్తంగా  కార్యక్రమన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం  అధికారికంగా ఈ కార్యక్రమం జరపాలని కోరారు. సావిత్రిబాయి పూలే విగ్రహం బీసీ సంఘం నాయకులు ఆధ్వర్యంలో  ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు.ఈ కార్యక్రమంలో నాయకులు కోన సత్యనారాయణ, పిల్లి శ్రీనివాసు, పెంకే గంగాధర్, మల్లువలస గణపతి రావు, విన్నకోట రాధాకృష్ణ ప్రసాద్, కోటిపల్లి సాయిరాం ,కోటిపల్లి కృష్ణ, మట్టపర్తి గోవిందరాజు, ఇళ్ల నరసింహమూర్తి, చుక్కల అప్పారావు, ముల్లేటి సత్తిబాబు, గోడి సుబ్రమణ్యం, వీరి కిరణ్ కుమార్ గౌడ్, మారిశెట్టి సత్యనారాయణ, చెల్లూరి కుమార్  పాల్గొన్నారు