ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు సమకూర్చం, ఈవో వీర్రాజు
ఉభయ రాష్ట్రాల భక్తుల కోర్కెలు తీర్చే చల్లని తల్లిగా చంటి పిల్లల సంరక్షణీ గా పేరుగాంచిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం చింతలూరు గ్రామంలో వేచి ఉన్న శ్రీ నూకంబిక అమ్మవారి కొత్త పూల జాగరణ మంగళవారం వేకువజామున ఆలయ కార్య నిర్వహణ అధికారి ఉండవల్లి వీర్రాజు చౌదరి, ఆలయ ధర్మకర్త మండలి చైర్మన్ వీరి అప్పారావు, ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కొత్త పువ్వుల జాగరణ ఘనంగా నిర్వహించారు, ముందుగా మన్యం నుంచి తీసుకువచ్చిన మోదుగు పువ్వుల తో అలంకరించిన పూలగరగను గ్రామస్తులు దర్శించుకుని మ్రొక్కులు చెల్లించుకున్నారు, అనంతరం చర్మ వాయిద్యాల దరువుకు అనుగుణంగా ఆసాధులు గరగా నృత్యాలు చేస్తూ భక్తులను ఆకర్షించారు, ఈ కార్యక్రమంలో వైట్ల గంగరాజు, గన్ని వెంకట్రావు ( చిన్నబ్బు ) వైట్ల శేషుబాబు, జూనియర్ అసిస్టెంట్ పవన్, అటెండర్ వీరన్న, మరియు భక్తులు, ఆలయ అర్చకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
