సుతాపల్లి లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించిన టిడిపి నాయకులు

 

కొత్తపేట : ఏప్రిల్ 25 బంగారం కొట్టు నారాయణరావుగా పిలవబడే ప్రముఖ వ్యాపారవేత్త లక్ష్మీనారాయణ థియేటర్ యజమాని సుతాపల్లి లక్ష్మీనారాయణ రావు బుధవారం స్వర్గస్తులైనారు. వారి మృతికి చింతిస్తూ కొత్తపేట టిడిపి నాయకులు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సత్య సాయి బాబా భక్తుడిగా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు. సహాయాన్ని అందించారు. అందరికీ సుపరిచితులుగా సుతాపల్లి లక్ష్మీనారాయణ రావు  నిలిచారు.కంఠంశెట్టి శ్రీనివాస్ గుబ్బల మూర్తి బండారు వీరన్న కాపు  వాసంశెట్టి సత్యనారాయణ శీలం సూరి చందర్రావు బంగారం తదితరులు పరామర్శించారు.