చింతలూరు గ్రామంలో ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు.

 44 ఏళ్లుగా తెలుగు ప్రజల జీవితంలో రాష్ట్ర జాతీయ రాజకీయాలలో వెలుగు నింపిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం.వాడవాడలా  సగర్వంగా సంబరాలు జరుపుకుంటున్న పసుపు జెండా శ్రేణులు.
క్రమశిక్షణకు మారుపేరుగా,పేదల సంక్షేమమే ధ్యేయంగా,నందమూరి తారక రామారావు  స్థాపించి గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అప్రతిహతంగా సాగుతున్న మన తెలుగుదేశం పార్టీ 44వ వసంతంలోకి అడుగుపెడుతున్న  శుభ సందర్భంగా చింతలూరు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, నాయకులు ఆవిర్భావ దినోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి, పార్టీ జెండాను ఆవిష్కరించి. జై తెలుగుదేశం పార్టీ నినాదాలతో మారు మోగిపోయింది. ఈ కార్యక్రమంలో చింతలూరు నాయకులు మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మగౌరవం, పేదలకు అన్నం బట్ట ఇల్లు కల్పించడం, సామాజిక న్యాయం, నారా చంద్రబాబు నాయుడు సుదీర్ఘ అనుభవంతో పార్టీ బలమైన అధికారపక్షంగా నిలిచింది అన్నారు. మరింత రోజుల్లో పార్టీని బలోపేతంగా ముందుకు తీసుకు వెళతామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షులు వైట్ల శేషుబాబు, పార్టీ ప్రెసిడెంట్ వైట్ల గంగరాజు,దండంగి రామారావు, వాకా గోవిందరాజు, పంది శ్రీనివాస్, వీరి అప్పారావు, రాజు, రాంబాబు,గణేష్, కాశి, మట్టా రాంబాబు,శివ తదితర నాయకులు పాల్గొన్నారు.