పేదల సేవలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం నియోజకవర్గ వ్యాప్తంగా లబ్ధిదారులకు రూ.18.26కోట్ల పంపిణీ...




కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు...ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం పేదల సేవలో ముందుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ప్రతీ నెలా ఒకటో తేదీన పింఛన్లను అందించడం, ఒకటో తేదీన సెలవు అయితే అంతకు ముందు రోజే పింఛన్లను అందించడం వారి నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. రావులపాలెం మండలం రావులపాడులో శనివారం ఆయన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. నాలుగు మండలాల్లో 57 గ్రామాలకు చెందిన 42వేల మందికి

రూ.18.26కోట్లను పంపిణీ చేయడం జరిగిందన్నారు.దేశంలో అధికంగా పింఛన్లు ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని తెలిపారు. రూ.4వేలు పింఛను అందిస్తున్న ఏకైక రాష్ట్రం మనదన్నారు. ప్రభుత్వ పరంగా పేదవర్గాలకు నేరుగా నగదు అందిస్తున్న అతి పెద్ద కార్యక్రమం దేశంలో ఇదేనని అన్నారు.  ఈనాడు పింఛన్లు అందుకున్న ప్రతీ ఒక్కరి కళ్లలో ఆనందం కనపడుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పింఛన్లను పెంచడం జరిగిందన్నారు. రూ.3వేల పింఛను రూ.4వేలకు జరిగిందన్నారు. దివ్యాంగుల పింఛను రూ.6000, మిగిలినవారికి సైతం రూ.10వేలు, రూ.15వేల వరకూ పెంచిన ఘనత ముఖ్యమంత్రి కే దక్కుతుందన్నారు. స్పౌజ్ పింఛన్లు వెంటనే అందించడం జరుగుతుందన్నారు. పింఛన్ల పంపిణీలో పాల్గొన్న నాయకులకు, ప్రభుత్వ అధికారులకు, ఉద్యోగులకు కృతఙ్ఞతలు తెలియజేశారు.