కూటమి సర్కార్‌పై ‘నిప్పులు’ చెరిగిన కొడమంచలి హరీష్: "20 లక్షలు భిక్షం కాదు.. 50 లక్షల న్యాయం కావాలి


జగన్ అన్న రికార్డు స్థాయి సాయం.. మీకెందుకు చేతకాదు?కూటమి ప్రభుత్వానికి సూటి ప్రశ్న? వేట్లపాలెం దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం ప్రకటించిన అరకొర ఎక్స్‌గ్రేషియాపై రాష్ట్ర మేధావుల వర్గం కార్యదర్శి కొడమంచలి హరీష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బాధితుల కన్నీళ్లను క్షేత్రస్థాయిలో చూసిన ఆయన, ప్రభుత్వ మొద్దు నిద్రను తూర్పారబడుతూ నిప్పులు చెరిగారు. ఈ సందర్బంగా హరీష్ మాట్లాడుతూ, ప్రస్తుత ప్రభుత్వంపై పదునైన విమర్శలు సంధించారు.ఒక నిండు ప్రాణం పోతే కేవలం 20 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటారా? ఇది బాధితులను ఆదుకోవడం కాదు, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే" అని హరీష్ మండిపడ్డారు. తక్షణమే ప్రభుత్వం తన మొండివైఖరి వీడి, ప్రతి బాధిత కుటుంబానికి రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం మరియు పక్కా గృహ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. బాధితుల కడుపు కోత చూస్తుంటే భగవంతుడే వారికి ఉపశమనం ఇవ్వాలి, ఈ ప్రభుత్వానికి మాత్రం కనికరం లేదు" అని ఆవేదన వ్యక్తం చేశారు.  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చూపిన మానవత్వాన్ని హరీష్ ఈ సందర్భంగా గుర్తు చేస్తూ కూటమి నాయకులకు చురకలు అంటించారు. "గతంలో విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటన జరిగినప్పుడు, జగన్ మోహన్ రెడ్డి  బాధితుల వద్దకు స్వయంగా వెళ్లి, ఒక్కో కుటుంబానికి రూ. కోటికి (సుమారు 90 లక్షలకు పైగా) పరిహారం అందించి వారి జీవితాల్లో వెలుగు నింపారు. అదీ నాయకత్వం అంటే! మరి నేడు కూటమి ప్రభుత్వం ఎందుకు వెనకాడుతోంది? పేదల ప్రాణాలంటే మీకు లెక్క లేదా?" అని నిలదీశారు.రాష్ట్ర ప్రజల క్షేమం, పేదవాడి ఇంట్లో చిరునవ్వు కేవలం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితోనే సాధ్యమని హరీష్ స్పష్టం చేశారు. రాష్ట్రం మళ్లీ సుభిక్షంగా ఉండాలన్నా, సామాన్యుడికి రక్షణ ఉండాలన్నా జగన్ అన్న మళ్లీ ముఖ్యమంత్రి కావాలి. వైసిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ప్రజలందరూ క్షేమంగా ఉంటారు. ఈ కూటమి ప్రభుత్వ అరాచక పాలన పోవాలి, జగన్  నాయకత్వం రావాలి" అని ఆయన పిలుపునిచ్చారు.