👉 మీడియా అక్రిడిటేషన్‌పై భారీ సమాచారం బయటకు రానుంది!

 



@-ఆర్‌టీఐకి ప్రభుత్వ సమాధానం – 629 పేజీల ఫైళ్లలో అసలు నిజాలు..?


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీడియా అక్రిడిటేషన్ కమిటీల ఏర్పాటు, సభ్యుల ఎంపిక విధానం మరియు అర్హత ప్రమాణాలపై నెలకొన్న అనుమానాల మధ్య దాఖలు చేసిన సమాచార హక్కు చట్టం (RTI) దరఖాస్తుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక సమాధానం ఇచ్చింది.


“వార్తా ప్రపంచం” డైలీ చీఫ్ ఎడిటర్ మరియు నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (NARA) ప్రతినిధి డా. బండి సురేంద్ర బాబు దాఖలు చేసిన ఆర్‌టీఐకు స్పందించిన సాధారణ పరిపాలన (I&PR) శాఖ, మీడియా అక్రిడిటేషన్‌కు సంబంధించిన మొత్తం 629 పేజీల అధికారిక రికార్డులు ఉన్నట్లు వెల్లడించింది.


ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం:


A.P. State Media Accreditation Rules–2025 రూపకల్పనకు సంబంధించిన నోట్ ఫైళ్లు,


రాష్ట్ర స్థాయి మీడియా అక్రిడిటేషన్ కమిటీ (SMAC) ఏర్పాటు నిర్ణయాలు,


జిల్లా స్థాయి మీడియా అక్రిడిటేషన్ కమిటీల (DMAC) నియామక ప్రక్రియ,


కమిటీల ఎంపిక వెనుక జరిగిన అధికారిక ఈ-ఫైల్ చర్చలు


అన్నీ కలిపి భారీ స్థాయిలో డాక్యుమెంట్లు ఉన్నట్లు స్పష్టం చేసింది.


ఈ సమాచారాన్ని అందించేందుకు రూ.1,408/- ఫీజు చెల్లించాలని ప్రభుత్వం సూచించింది.


ఈ సందర్భంగా డా. బండి సురేంద్ర బాబు మాట్లాడుతూ — మీడియా అక్రిడిటేషన్ ప్రక్రియలో పారదర్శకత ఉందా? అర్హులకే అవకాశాలు దక్కాయా? లేక రాజకీయ ప్రభావం పనిచేసిందా? అనే అంశాలు ఈ డాక్యుమెంట్లు బయటకు వచ్చిన తర్వాత స్పష్టమవుతాయని తెలిపారు.


రాష్ట్రంలో అక్రిడిటేషన్ కమిటీల ఏర్పాటుపై జర్నలిస్టుల వర్గాల్లో వ్యక్తమైన సందేహాలకు ఇప్పుడు అధికారిక రికార్డుల ద్వారానే సమాధానం లభించనుందని, సమాచారం అందిన వెంటనే పూర్తి స్థాయి విశ్లేషణను ప్రజల ముందుకు తీసుకువస్తామని ఆయన పేర్కొన్నారు.


మీడియా హక్కులు, చిన్న మరియు స్వతంత్ర పత్రికల న్యాయమైన ప్రతినిధిత్వం కోసం ఈ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.


జారీ చేసినవారు:

డా. బండి సురేంద్ర బాబు

చీఫ్ ఎడిటర్, "వార్తా ప్రపంచం" డైలీ.,

నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (NARA