మార్చి 6 న స్వాతంత్ర్య సమరయోధురాలు తల్లాప్రగడ విశ్వసుందరమ్మ, గారి జయంతి సందర్బంగాడోన్ పట్టణం లో సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి ఆధ్వర్యం లో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు, తల్లాప్రగడ విశ్వసుందరమ్మ, గారి జయంతి సందర్బంగా వారి చిత్ర పటానికి పూలమాల వేసి ఘణంగా నివాళి అర్పించారు. వారిని స్మరించుకున్నారు.ఈ సందర్బంగా సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి మాట్లాడుతూ మన దేశ స్వాతంత్య్ర సమరయోధులను, శాస్త్రవేత్తలను ,మహనీయులను, సమాజానికి సేవలు అందించిన ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి తెలిపారుతల్లాప్రగడ విశ్వసుందరమ్మ 1899 మార్చి 6 జన్మించారు. ఈమె 1930లో ఉప్పు సత్యాగ్రహంలో చురుకుగా పాల్గొని జైలుకి వెళ్ళి 6 నెలలు శిక్షను అనుభవించారు. 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. తల్లాప్రగడ విశ్వసుందరమ్మ 1949 ఆగష్టు 30 న స్వర్గస్తులైనారు. ఇటువంటి స్వాతంత్ర్య సమరయోధులను ఎల్లవేళల స్మరించుకుంటూ దేశంలోని విద్యార్థులందరూ సమాజసేవ లో భాగస్వాములై దేశానికి సేవ చేయాలని సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి కోరారు
