ఆలమూరు ఎంపీడీఓ ఎ రాజు ఆధ్వర్యంలో ముమ్మరంగా ( యూనిఫైడ్) కుటుంబ సర్వే పర్యవేక్షణ*
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) ఎ. రాజు మండలంలో జరుగుతున్న ప్రభుత్వ కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో భాగంగా మండలపరిధిలో జొన్నాడ,చొప్పళ్ళ గ్రామాల్లో బుధవారం ఆయన ప్రభుత్వ ప్రతిష్టాత్మక యూనిఫైడ్ ఫ్యామిలీ మరియు వ్యక్తిగత సర్వేను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ ఇంటింటికి వెళ్లి సిబ్బంది నమోదు చేస్తున్న వివరాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సర్వేలో ప్రతి ఒక్కరి సమాచారం ఖచ్చితంగా నమోదు చేయాలని, ప్రజలు ఎటువంటి భయం లేకుండా ప్రభుత్వ పథకాల లబ్ధి కోసం తమ వివరాలు అందించాలని, డేటా నమోదులో ఎలాంటి పొరపాట్లు జరగకుండా అధికారులు జాగ్రత్త వహించాలని ఆయన స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఆలమూరు గ్రామములోని బస్ స్టాండ్ వద్దగల భవిత మనోవికాస పాఠశాలలో పిల్లల సౌకర్యార్థం మండల పరిషత్ 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించి, రూపుదిద్దుకొంటున్న ఆధునిక బాత్రూమ్స్ నిర్మాణం, స్వచ్ఛమైన తాగునీటి సదుపాయం వంటి మౌలిక వసతులు పర్యవేక్షించారు . ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు మెరుగైన వసతులు కల్పించడం మన బాధ్యత అని పేర్కొన్న ఎంపీడీఓ, నిధులను సద్వినియోగం చేస్తూ పాఠశాల రూపురేఖలు మార్చామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు పాల్గొన్నారు.
