- సభ్యత్వాల నమోదును పరిశీలించిన నాయకులు సూరపురెడ్డి సత్య, నల్లా వెంకన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపులో భాగంగా కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం లో జనసేన సభ్యత్వ నమోదు వేగంగా సాగుతుందని జనసేన పార్టీ మండలం కన్వీనర్ సూరపురెడ్డి సత్య, చింతలూరు పిఎసిఎస్ అధ్యక్షుడు నల్లా వెంకన్న తెలిపారు. సభ్యత్వాలు నమోదును పెనికేరులో జరుగుతున్న నమోదు కార్యక్రమాలను వారు పరిశీలించారు. సభ్యత్వాలు నమోదు కార్యక్రమం నిర్ణయించిన గడువులోపు పూర్తి చేయాలని వారు సూచించారు. మండలంలో సభ్యత్వలను నమోదు లో వెనుకబడిన గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి అక్కడ కార్యకర్తలను నాయకులను సమన్వయంతో ముందుకు సాగే విధంగా చర్యలు చేపట్టినట్లు వారు వివరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.