ఆజూస్ డైరెక్టర్ డాక్టర్ యార్లగడ్డ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో వద్దిపర్రు గ్రామ వీఆర్ఓ గా పదవి విరమణ చేసిన యార్లగడ్డ ఏలియాకు ఘన సన్మానం

సన్మాన గ్రహీత యార్లగడ్డ ఏలీయా

డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలం రావులపాలెం గ్రామం లో సోమవారం సన్మాన కార్యక్రమం నిర్వహించిన ఆజూస్ డైరెక్టర్ డాక్టర్ యార్లగడ్డ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో ఆత్రేయపురం మండలం వద్దిపర్రు గ్రామ వీఆర్ఓ గా పదవి విరమణ చేసిన యార్లగడ్డ ఏలియాకు ఘన సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా ఏలియా గ మాట్లాడుతూ నేను వీఆర్వో గా బాధ్యతలు స్వీకరించిన నాటినుండి ఇంతవరకు ఎటువంటి మచ్చ లేకుండా నా ఉద్యోగాన్ని నిర్వర్తించి నేను నిధులలో బాధ్యతగా వ్యవహరిస్తూ అనేకమంది పేదవాళ్లు సహాయం కోరి వస్తే వారి దగ్గర నుండి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా నా వంతు కృషిచేసి వారికి సహాయ సహకారాలు అందించాను ఇప్పుడు ఉద్యోగ విరమణ చేసిన కూడా నా నుంచి ఎటువంటి సహకారాలు కావాలన్నా నేను అందుబాటులో ఉంటానని మాట్లాడారు.ఈ కార్యక్రమంలో అజుస్ ఫౌండేషన్ చైర్మన్ యార్లగడ్డ సురేష్ కుమార్ ప్రెసిడెంట్ పలివెల సాల్మన్ రాజు జాయింట్ సెక్రెటరీ అయినవిల్లి విజయబాబు దయాకర్ కొమ్మర లక్ష్మణరావు పనసయ్య కొమ్మర రాజు ఎం ఈ ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుడెల్లి సురేష్ ఎం ఈ ఎఫ్ కోనసీమ జిల్లా కోశాధికారి చంద్రమల్ల సుధాకర్ బాబు యూటీఎఫ్ నాయకులు విజయభాస్కర్ వై ఎస్ ఆర్ పి నాయకులు నేకూరి రాజేష్ కుమార్ చదలవాడ మసేన్ అజూస్ స్వచ్ఛంద సంస్థ సలహాదారులు కొల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.