ఈతకోట శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయం అత్యంత ఘనంగా నిర్వహించిన భారీ అన్న సమరాధన



రావులపాలెం:

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండల పరిధిలోని ఈతకోట గ్రామంలో జాతీయ రహదారి చెంతనే కొత్త సెంటర్లో కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మవారి ఆలయం వద్ద భారీ అన్న సమారాధన నిర్వహించారు దసరా మహోత్సవాలు శ్రీదేవి శరన్నవరాత్రులను పురస్కరించుకుని ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో అమ్మవారి ఆలయంలో నిర్వహించిన నవరాత్రుల పూజల సందర్భంగా భక్తులు దాతలు విరాళాల సహకారంతో శనివారం నాడు దుర్గమ్మవారి ఆలయం వద్ద ఆలయ కమిటీ చైర్మన్ వెలుగట్ల రామకృష్ణ. కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అన్న సమారాధన నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు మహిళలు ప్రజలు పాల్గొని దుర్గాదేవి. దుర్గామాతను దర్శించుకుని అన్న ప్రసాదాలను స్వీకరించారు సుమారు 8000 వేలమందిపైగా భక్తులు అన్న సమారాధనలో పాల్గొన్నారు