రూ.25 లక్షలతో రావులపాలెం ఎన్ హెచ్ 216 ఏ జంక్షన్ వద్ద లూప్ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు...

రావులపాలెం కళా వెంకట్రావు సెంటర్ వద్ద జాతీయ రహదారి 216 ఏ కు అటు అమలాపురం ఇటు బొబ్బర్లంక రహదారులను అనుసంధానం చేసే లూప్ రోడ్డు నిర్మాణం నిమిత్తం మంగళవారం కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, కొత్తపేట జనసేన ఇన్చార్జ్ బండారు శ్రీనివాస్ తో కలిసి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. రూ.25 లక్షలతో అభివృద్ధి చేయనున్న ఈ లూప్ రోడ్ నిర్మాణం వల్ల కళా వెంకట్రావు సెంటర్ వద్ద వాహనదారులు పడుతున్న ఇబ్బందులు తొలిగిపోతాయని ఆయన అన్నారు. సెంటర్ వద్ద రహదారుల పరిస్థితులను నిశితంగా పరిశీలించారు. ట్రాఫిక్ జాములు నివారణకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో మాట్లాడారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.