కూటమి ప్రభుత్వంలో పల్లెల్లో మౌలిక సదుపాయాలు కల్పన వేగంగా జరుగుతుందని, దానితో గ్రామాల్లో అభివృద్ధి పరుగులు పెడుతుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు.ఆదివారం ఆలమూరు మండలంలో ట్రాన్స్ఫార్మర్ ప్రారంభం, రహదారి మరమ్మత్తు పనుల ప్రారంభం కార్యక్రమాల్లో ఆయన కొత్తపేట జనసేన ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ తో కలిసి పాల్గొన్నారు. మొదటగా చొప్పెల్లలో నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ ను ప్రారంభించారు. అనంతరం రూ.35లక్షల నిధులతో చేపట్టిన సంధిపూడి - వెదురుమూడి ఆర్ అండ్ బి రహదారి మరమ్మత్తు పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం రూ.30లక్షలతో చేపట్టనున్న చింతలూరు ప్రధాన రహదారి మరమత్తు పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
