₹5 రూపాయలకే అన్నార్తుల ఆకలిను తీర్చే అన్న క్యాంటీన్ లు
కొత్తపేట :
ఐదు రూపాయలకే ఆకలిని తీర్చే అన్న క్యాంటీన్ కొత్తపేటలో త్వరలో ప్రారంభం కాబోతోంది. ఇది అన్నార్తులకు ఎంతో ప్రయోజనం చేకూర్చనుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అన్న క్యాంటీన్ లను ప్రధాన పట్టణ కేంద్రాలలో ప్రారంభించారు.నియోజవర్గాల వారీగా అంచలంచలుగా విస్తరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ ఆనాడు తెలియజేశారు. అన్న క్యాంటీన్ అవసరాన్ని గుర్తించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు చొరవ తీసుకుని కొత్తపేటలో ప్రారంభించేందుకు శ్రీకారం చుట్టారు.స్థల సేకరణ చేపట్టి నిధులు మంజూరుకు కృషి చేశారు. దాని ఫలితంగా కొత్తపేటలో త్వరలో అన్న క్యాంటీన్ ప్రారంభం కాబోతోంది.ఇటీవల ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్న క్యాంటీన్ పనులను పరిశీలించారు. పనులు వేగవంతంగా పూర్తి చేసి అందుబాటులో తీసుకురావాల్సిందిగా కాంట్రాక్టర్ కు ఆదేశాలిచ్చారు.
కొత్తపేటలో ముఖ్య కూడలిలో అన్న క్యాంటీన్ నిర్మించడం వలన విశేష ఆదరణ కలుగుతుందని పేర్కొనవచ్చు.
ఇటు ప్రభుత్వ ఆసుపత్రికి సబ్ రిజిస్టర్ ఆఫీస్ కు పూర్వపు ఎమ్మార్వో ఆఫీస్ దగ్గరగా రైతు బజార్ పక్కన బస్టాండ్ సెంటర్ వద్ద అన్న క్యాంటీన్ నిర్మిస్తున్నారు. అందరికీ అందుబాటులో నిర్మించడం అన్నార్తులకు ఎంతో ప్రయోజనకరం కానుంది.చుట్టుపక్కల ప్రాంతాల నుండి వివిధ పనులపై మండల కేంద్రం కొత్తపేట వచ్చే ప్రజలకు భోజన సమయంలో ఆకలి తీర్చే అక్షయ పాత్ర గా నిలుస్తుందని హర్షిస్తూ మంచి స్థలాన్ని ఎన్నుకుని అన్న క్యాంటీన్ నిర్మిస్తున్న ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ను మరియు కూటమి ప్రభుత్వాన్ని కొత్తపేట నియోజకవర్గ ప్రజానీకం ప్రసంశిస్తున్నారు.
అన్ని పనులు పూర్తిచేసి త్వరలో ఈ అన్న క్యాంటీన్ ను ఎమ్మెల్యే సత్యానందరావు ప్రజలకు అందుబాటులోకి తీసుకురాబోతున్నారు.