డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో గత 646 రోజులు గా నిత్యం ఉచిత అన్నదానం చేస్తూ ప్రజల గుండెల్లో నిలిచిన పారిశ్రామిక వేత్త చిన్నం తేజా రెడ్డి ఆరోగ్యమే మహా భాగ్యం అనే సూక్తి ను ఆదర్శంగా తీసుకుని యువతకు “కోనసీమ రన్ – రన్ రన్ గ్రీన్, బ్రీత్ క్లిన్” ప్రోగ్రామ్ నిర్వహించనున్నారు.ఈ సందర్భంగా 2026 ఫిబ్రవరి 8న జరగనున్న “కోనసీమ రన్ – రన్ రన్ గ్రీన్, బ్రీత్ క్లిన్” కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్‌ను ఎమ్మెల్యే బండారు సత్యానందరరావు మంగళవారంఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛమైన గాలిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని అన్నారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త చిన్నం తేజారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కోనసీమ రన్‌లో 3కే, 5కే, 10కే రన్, వాక్‌లు శ్రీపాతం శెట్టి రామిరెడ్డి పార్క్ నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు. యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కొత్త పేట నియోజకవర్గ శాసన సభ్యులు బండారు సత్యానంద రావు, కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి బండారు శ్రీను,రాష్ట్ర రైతు మిత్ర ఆకుల రామకృష్ణ,చిలుకూరు సతీష్ రాజు తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
