రావులపాలెం : జనవరి 25 : ఆదివారం : సెయింట్ ఫ్యాట్రిక్స్ అకాడమీలో అకాడమీ ప్రిన్సిపాల్ రెవరెండ్ బ్రదర్ మనూ మాథ్యూ అధ్యక్షతన కాల్ఫ్యూజియన్ చెస్ అకాడమీ మరియు ఆంధ్రప్రదేశ్ చెస్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన అఖిలభారత గణతంత్ర చదరంగపు పోటీలు ఎంతో అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త , అన్నదాత అయిన చిన్నం తేజా రెడ్డి ఈ పోటీలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా తేజారెడ్డి మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలలో స్థాపించబడిన అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఏకైక విద్యాసంస్థ మన సెయింట్ ఫ్యాట్రిక్స్ అకాడమీ మన రావులపాలెం లో ఉండడం మనకు ఎంతో గర్వకారణమని ఇక్కడ చదువుతోపాటుగా ఆటపాటలను ప్రోత్సహిస్తూ విద్యార్థులకు మానసిక వికాసంతో పాటుగా మానవ విలువలు గురించి బోధించి ఉత్తము పౌరులుగా తీర్చిదిద్దుతున్న అకాడమీ యాజమాన్యమును ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను అని అన్నారు. ఈ పోటీలలో తెలుగు రాష్ట్రాల నుండి సుమారుగా 270 మంది బాల బాలికలు పాల్గొనటం చాలా గర్వించదగిన విషయమని అన్నారు. ఇందులో అండర్ 16 ,అండర్ 13 ,అండర్ 9 విభాగాలలో బాల బాలికలకు విడివిడిగా పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన కపిలేశ్వరపురం పారిస్ ఫీస్ట్ రెవరెండ్ ఫాదర్ గుత్తికొండ స్లీవరాజు మాట్లాడుతూ విద్యార్థులలో దాగి ఉన్న కళలు బహిర్గతం కావడానికి ఆటపాటలు ఎంతగానో తోడ్పడతాయని విద్యార్థులకు చదువుతోపాటుగా శారీరిక, మానసిక ఎదుగుదల ఎంతో ముఖ్యమని అన్నారు ఈ సందర్భంగా విజేతలకు బహుమతి ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో క్రియేటివ్ గ్రీన్ ఇన్వెన్షన్స్ అధినేత కొవ్వూరి నరేష్ రెడ్డి , దేవి జ్యూయలర్స్ అధినేత ఆరేటి సూర్యచంద్ర రావు , సాయి తేజ ఎంటర్ప్రైజెస్ అధినేత ద్వారంపూడి శ్రీనివాస రెడ్డి ,ఆంధ్రప్రదేశ్ చెస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వై. సుమన్ , టోర్నమెంట్ న్యాయ నిర్ణీత వి . కుమార్ మరియు డైరెక్టర్ వి . హైమావతి , అకాడమీ కమ్యూనిటీ లీడర్ రెవరెండ్ బ్రదర్ సోల్మన్ అలెగ్జాండర్ , స్పోర్ట్స్ సెక్రటరీ రెవరెండ్ బ్రదర్ శశి రాజు పీఈటీలు విజయ్ , శైలస్ అకాడమీ కోఆర్డినేటర్లు , ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
