ఈ నెల 25వ తేదీన సూర్యారావుపేట లో దొమ్మేటి వెంకట రెడ్డి విగ్రహావిష్కరణ, భారీ అన్న సమారాధన.



ఆలమూరు: ఆలమూరు మండల పరిధిలోని సూర్యారావుపేట లో ప్రముఖ సామాజిక కార్యకర్త, విద్యావేత్త, కుల నాయకుడు అయిన దొమ్మేటి వెంకట రెడ్డి విగ్రహావిష్కరణ ఈనెల 25వ తేదీన కార్మిక శాఖ మంత్రి వర్యులు వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వారిచే ఉదయం విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరుగును.అనంతరం వచ్చిన వారందరికీ మధ్యాహ్నం భారీ అన్న సమారాధన జరుగును.దొమ్మేటి వెంకట రెడ్డి (1853-1928) ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త,వ్యాపారి,విద్యావేత్త, మరియు కుల నాయకుడు.ఆయన ఈడిగ/ఈండ్ర కులాన్ని 'శెట్టిబలిజ'గా గుర్తించేందుకు కృషి చేసి,విద్య, సామాజిక సంస్కరణలలో కీలక పాత్ర పోషించారు. కోనసీమలోని అల్లవరం మండలం బోడసకుర్రు గ్రామంలో ఆయన నిర్మించిన చారిత్రక భవనం (మెడ) ప్రసిద్ధి చెందింది. ఆయన జననం మరియు విద్య: 1853 మార్చి 23న తూర్పుగోదావరి జిల్లా, బోడసకుర్రులో జన్మించారు,అమలాపురంలోని ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు.సామాజిక మరియు కుల సంస్కరణలు:1920లో కుల సమావేశాన్ని

నిర్వహించి, ఈడిగ/ఈండ్ర కులాన్ని శెట్టిబలిజగా పిలవాలని తీర్మానించారు, ఇది సామాజిక గుర్తింపులో ముఖ్యమైన మార్పు.విద్యా సేవ: గాంధీజీ కంటే ముందే వయోజన విద్యను ప్రారంభించారు,విద్యాభివృద్ధికి కృషి చేశారు, ఆయన పేరుతో పేరూరులో ఒక ఉన్నత పాఠశాల  కూడా ఉంది. అలాంటి మహోన్నతమైన వ్యక్తి విగ్రహావిష్కరణ సూర్యారావుపేటలో జరగడం చాలా ఆనందంగా ఉందని సూర్యారావుపేట నివాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఆలమూరు మండలంలోని మీడియా మిత్రులందరూ తప్పనిసరిగా రావలసిందిగానూ, విందు భోజనాలను ఆరగించవలసిందిగా విగ్రహ కమిటీ నాయకులు కోరుచున్నారు.