రథసప్తమి సందర్భంగా ప్రత్యేక పూజలు

*శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్న జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి మరియు మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి*

రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి గారు మరియు కాకినాడ మాజీ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ రోజు గొల్లలమామిడాడ గ్రామంలో వేంచేసివున్న శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొని రాష్ట్ర ప్రజల సంక్షేమం, శాంతి, అభివృద్ధి కోసం స్వామి వారిని ప్రార్థించారు. రథసప్తమి సూర్యారాధనకు అంకితమైన పవిత్రమైన పండుగగా పేర్కొంటూ, ప్రజలందరికీ ఆరోగ్యం, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు ప్రసాదించాలని స్వామి వారిని కోరుకున్నారు.సూర్యనారాయణ స్వామి కృపతో రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.