కొత్తపేట నియోజకవర్గoలో ఘనంగా నిర్వహించిన మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు


*రక్తదానం చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి*

*రక్తదాన శిబిరం,దుప్పట్ల పంపిణీ,రైతులకు యూరియా,పిల్లలకు ఉయ్యాలలు, కేక్ కటింగ్ ఏర్పాటు చేసిన జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి*

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మరియు కొత్తపేట గ్రామంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి  ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ముందుగా రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయం వద్ద ప్రత్యేక ప్రతిభావంతుల సమక్షంలో కేక్ కటింగ్ నిర్వహించి, వారికి దుప్పట్లు మరియు విందు కార్యక్రమం నిర్వహించారు . అనంతరం కొత్తపేట గవర్నమెంట్ ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం మరియు రైతులకు యూరియా , కేక్ కటింగ్ మరియు పిల్లలకు ఉయ్యాలల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అమలాపురం పార్లమెంట్ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి , కొత్తపేట నియోజకవర్గ పరిశీలకులు పాటి శివకుమార్ , మరియు ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు,ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.