డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, మామిడికుదురు గ్రామం ,ఆల్ కాస్ట్ కాలనీలో రెండు రోజులు క్రితం 12 ఇల్లు అగ్నికి ఆహుతై సర్వం కోల్పోయి 14 మంది కుటుంబాలు రోడ్డున పడ్డాయని సామాజిక కార్యకర్త సూరపురెడ్డి సురేష్ ద్వారా తెలుసుకున్న ఉప్పలగుప్తం మండలం ,వానపల్లిపాలెం గ్రామానికి చెందిన నల్లా మణికంఠ(బాబి),దేవి దంపతులు వారి కుమారుడు కోటేష్ పుట్టినరోజు సందర్భంగా 20వేల రూపాయల నిత్యవసర వస్తువులు ఎమ్మెల్యే దేవా వరప్రసాద్, ఎమ్మార్వో పి. సునీల్ కుమార్,వీఆర్వో శ్రీనివాస్ మరియు సీనియర్ జనసేన నాయకులు అడబాల తాత కాపు మరియు నల్లా బేతాళుడు గారు చేతుల మీదగా అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మరియు ఎమ్మార్వో ,బాబి మరియు సురేష్ సేవలను కొనియాడారు. బాధితులందరూ బాబును దీవిస్తూ బాబి గారి దంపతులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.