అంతర్జాతీయ బాడ్మింటన్ క్రీడా కారుడు సాత్విక్ సాయిరాజ్
చిన్నతనం నుంచి ఎంతో ఇష్టమైన షటిల్ బ్యాడ్మింటన్ లో శిక్షణ ఇచ్చి అంతర్జాతీయ క్రీడాకారునిగా తీర్చిదిద్దిన తండ్రి రుణాన్ని ఏమిచ్చి తీర్చుకోగలను..తండ్రి రంకిరెడ్డి కాశీ విశ్వనాథం పేరిట స్పోర్ట్స్ కాశి బ్యాడ్మింటన్ అకాడమీని ఏర్పాటు చేసి తొలి దశలో ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయిలో టోర్నమెంట్ నిర్వహించి కొంత రుణం రుణం తీర్చుకున్నట్టు అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ పేర్కొన్నారు.తండ్రి ఆశయ సాధనకు ఆయన చూపిన క్రీడా స్ఫూర్తితో జీవితాంతం ముందుకు సాగుతానన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి సైతం జాతీయ,అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు అమలాపురం దుడ్డువారి అగ్రహారంలోని ఆఫీసర్స్ రిక్రియేషన్ క్లబ్లో ప్రత్యేక శిక్షణ అందించే విధంగా ఏర్పాటు చేసామన్నారు.ఇందుకోసం ప్రత్యేకంగా ముగ్గురు కోచ్ లను సోదరుడు రామ్ చరణ్ తో కలిసి నియమించామని వెల్లడించారు.తండ్రి కాశి ఆశయ సాధనకు కృషి చేస్తున్న సాత్విక్ సాయిరాజ్ ను
కోనసీమ ఆహారనిధి వ్యవస్థాపక అధ్యక్షుడు వీరంశెట్టి సతీష్ ఆదివారం జ్ఞాపిక అందించి సత్కరించారు.కార్యక్రమంలో పంచాయితీ రాజ్ డీఈఈ అన్యం రాంబాబు,ఆహారనిధి సభ్యులు వీరు గట్టెం,బండారు సురేష్,పోలిశెట్టి పవన్ మహేష్,వేదుళ్లపల్లి అయ్యప్పస్వామి తదితరులు పాల్గొన్నారు...
