పలివెల ఉమాకొప్పులింగేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే బండారు...
స్వామివారి రథోత్సవాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు..
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రముఖశైవక్షేత్రం పలివెల శ్రీ ఉమాకొప్పులింగేశ్వరస్వామి వారి ఆలయాన్ని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో అధికారులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్వహించే రథోత్సవాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
