ఒక రోజు ముందుగానే పింఛన్లు అందజేత,లబ్ధిదారుల ఆనందం
రెడ్డి సుబ్రహ్మణ్యం,అనంతకుమారి
కొత్తపేట..నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పింఛన్ దారుల కష్టాలను గుర్తించి వారి ముంగిటకే లబ్ధిని చేకూరుస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం మరియు ఏపీ బీసీ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి అనంతకుమారి పేర్కొన్నారు.శనివారం కొత్తపేటలోని మారుతి సెంటర్ పరిధిలో నిర్వహించిన ‘ఎన్టీఆర్ భరోసా’ సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో వీరు ఉమ్మడిగా పాల్గొని లబ్ధిదారులకు పింఛన్ నగదును అందజేశారు.ఈ పంపిణీలో భాగంగా మారుతి సెంటర్ లోని ఒకే ఇంట్లో నివసిస్తున్న ముగ్గురు లబ్ధిదారులకు పింఛన్ అందించి వారి ముఖాల్లో చిరునవ్వు నింపారు.బండారు రాజు కాపుకు వృద్ధాప్య పింఛను రూ. 4,000, బండారు వీరలక్ష్మికి దివ్యాంగుల పింఛన్ రూ. 6,000, మరియు భర్తను కోల్పోయి తండ్రి వద్ద నివాసం ఉంటున్న సీహెచ్.ఎస్. దుర్గాదేవికి వితంతు పింఛన్ రూ. 4,000 చొప్పున.. మొత్తంగా ఒక చోటే నివాసం ఉంటున్న వీరికి 14,000 అందజేశారు.ఈ సందర్భంగా రెడ్డి సుబ్రహ్మణ్యం మరియు రెడ్డి అనంతకుమారి మాట్లాడుతూ, లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఒకటవ తేదీ ఆదివారం రావడంతో ప్రభుత్వం ఒక రోజు ముందుగానే పింఛన్ల పంపిణీ చేపట్టిందని తెలిపారు.పింఛన్ మొత్తాన్ని గణనీయంగా పెంచి వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు కొండంత అండగా నిలిచామని వారు స్పష్టం చేశారు. "సంక్షేమ పథకాల అమలులో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తూ, నిజమైన పేదలకు న్యాయం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం" అని వారు పునరుద్ఘాటించారు.ఈ కార్యక్రమంలో మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి కడలి భీమా, జోగి గని రాజు,కొప్పిశెట్టి శ్రీరామ్,పంచాయతీ కార్యదర్శి దాసరి వెంకటేశ్వరావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
