ప్రతిభ కు పట్టం...రాష్ట్ర స్థాయి లో మండపేట ఎస్ ఎస్ వి వి పాఠశాలకు ప్రధమ స్థానం...




మండపేటలోని సర్దార్ వేగుళ్ళ వీర్రాజు పుర పాలక సంఘం హై స్కూల్  సమర్పించిన  స్మార్ట్ పుడ్ 

ప్రొటెక్టర్ ప్రాజెక్టు రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించింది. డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్  కోనసీమ జిల్లా మరో గర్వకారణమైన విజయాన్ని సాధించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో సైన్స్ సిటీ ఆఫ్ ఆంద్ర ప్రదేశ్  నిర్వహించిన సైన్స్ సమగ్ర మహోత్సవ్–2కే 26లో జిల్లా ప్రతిభ రాష్ట్ర స్థాయిలో మెరిసింది.

గైడ్ ఉపాధ్యాయురాలు మేకా రామలక్ష్మీ మార్గనిర్దేశంలో జానా శ్రీహరి విఘ్నేష్ బసవ కుమార్, మొండెం శ్రీ వైష్ణవ్ స్వరూప్, అడపాక దుర్గా మణికంఠ కుమార్ (8వ తరగతి విద్యార్థులు) ఈ విజయాన్ని అందుకున్నారు. విద్యుత్ అవసరం లేకుండా ఆహారాన్ని సంరక్షించే వినూత్న ఆలోచనతో ఈ ప్రాజెక్టు ప్రత్యేక గుర్తింపు పొందింది.

విజయవాడలోని చిట్టూరి హై స్కూల్ లో జరిగిన బహుమతి కార్యక్రమంలో ఏపీ ఎయిర్పోర్ట్  డెవలప్మెంట్ కార్పొరేషన్  ఏం డి  ప్రవీణ్ ఆదిత్య, సైన్స్ సిటీ ఆఫ్ ఆంద్ర ప్రదేశ్ సి ఇ ఓ వెంకటేశ్వరరావు లు బహుమతులు అందజేశారు.

ఈ మహోత్సవం ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్ లో స్థానం సంపాదించడం మరో విశేషం.

జిల్లా విద్యాశాఖ అధికారి పి. నాగేశ్వరరావు, సమగ్ర శిక్ష డిప్యూటీ కలెక్టర్, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, జిల్లా సైన్స్ అధికారి జి.వి.ఎస్. సుబ్రహ్మణ్యం, జిల్లా ఉప విద్యాశాఖ అధికారి బి. రామలక్ష్మణమూర్తి, మండల విద్యాశాఖ అధికారులు నాయుడు రామచంద్రరావు, సోమిరెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సైన్స్ ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు.ఈ విజయం జిల్లా విద్యార్థుల ప్రతిభకు ప్రతీకగా నిలిచింది.