👉మహాశివరాత్రి కారణంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పంచారామాలలో ఒకటైన సామర్లకోటలోని శ్రీ చాళుక్య కుమార రామ భీమేశ్వర స్వామి ఆలయం, పిఠాపురం లోని శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయం లో ఏర్పాటు చేసిన బందోబస్తు చర్యలను కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ పర్యవేక్షించారు.
ఆలయంలో అమలు చేస్తున్న భద్రతా ఏర్పాట్లు, వృద్ధులు, మహిళలు, చిన్నారుల కోసం తీసుకున్న ప్రత్యేక సదుపాయాలు, దర్శన లైన్లు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ప్రసాద కౌంటర్లు, అన్నప్రసాద పంపిణీ వంటి అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, శాంతి భద్రతల పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.✍️
