ఈ నెల 18న పల్నాడు జిల్లా కు వై ఎస్ షర్మిలరెడ్డి రాక
ఈ నెల 18న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి వై ఎస్ షర్మిలరెడ్డి పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట కు రానున్నారని పల్నాడు జిల్లా డి సి సి అధ్యక్షులు గర్నేపూడి అలెగ్జాండర్ సుధాకర్ అన్నారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి పేరు మార్పు పై నిరసనగా ఉపాధి హామీ పథకం కార్యక్రమంలో పాల్గొని నిరసన తెలిపి అనంతరం మీడియాతో మాట్లాడనున్నట్లు పల్నాడు జిల్లా డి సి సి అధ్యక్షులు గర్నేపూడి అలెగ్జాండర్ సుధాకర్ అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్లు,పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనున్నారని ఆయన తెలిపారు.
