నిజాయితీగా తన పండించిన పంటను అమ్ముకోవడానికి ఒంటరివాడై అన్నదాత విలవిలలాడుతున్నాడు



 జై జవాన్ జై కిసాన్ అంటారు వ్యవసాయం అనే పదంలోని సహాయం ఉందని చెబుతారు దేశానికి సరిహద్దుల్లో సైనికుడు ఎంత గొప్పవాడు మనం తినే పంటను పండించి మనకి అన్నం పెడుతున్న అన్నదాత రైతు అంత గొప్పవాడని చెప్పారు కానీ ఇవి ఆచరణకు నోచుకోవటం లేదుఏ విధంగా చూసినా నష్టపోయేది రైతే ఎదుట వ్యక్తిని మోసం చేయటం చేతకాని రైతు అనేకమంది చేతుల్లో మోసపోయి చివరకు నష్టపోయి ఆత్మహత్యలు చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు అంటే కారణం ఇదే🙏 ఆరుగాలం కష్టపడి పండించి చేతికి వచ్చే టైం లో మొక్కజొన్న దాల్వ పంటలకు వర్షం కారణంగా అన్నదాతలను భయపెడుతూ నానా బాధలు పడుతూ ఎండబెట్టుకుని అమ్ముకుందామని చూస్తున్న టైం లో సరైన మద్దతు ధర లభించక బస్తా కి కొన్ని వందల నష్టం వచ్చిన భరించి అయిన కాడికి తెగేసి అమ్మిన కొని నాధుడు లేక అన్నదాత అనేక విధాలుగా కష్టాలకు గురి అవుతున్నారు దీన్ని అరికట్టాలి రైతులను ఆదుకోవాలి సదరు విషయాన్ని రేపు మన నియోజకవర్గానికి వస్తున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి రైతులు కవులు రైతులు రైతుల ప్రతినిధులు అందరూ కలిసి వారిని కలిసి సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లాలని ఆ విధంగా రైతులకు మేలు చేసి ఆదుకోవాలని కోరుకుంటున్నాను మంచినీళ్లలో చేపలు ఎక్కువగా ఉండవు మురికి నీళ్లలో ఎక్కువ చేపలు దొరుకుతాయి అదే విధంగా మురికి మనుషులు దగ్గర దళార్లు దగ్గ అబద్ధాలు చెప్పే వారి చుట్టూ మనుషులు ఉంటారు నిజాయితీగా బతికే మనిషి ఎప్పుడు ఒంటరిగానే మిగిలిపోతాయి అదే విధంగా నిజాయితీగా తన పండించిన పంటను అమ్ముకోవడానికి ఒంటరివాడై అన్నదాత విలవిలలాడుతున్నాడు వారిని కాపాడుకోవాలి ఆదుకోవాలి ఇట్లు మీ  లుక్కా వెంకట శ్రీనివాసరావు రొయ్యూరు👈