పార్టీ సిద్ధాంతాలను యువత ప్రజల్లోకి తీసుకెళ్లాలి - యువనేత బండారు సంజీవ్ ..

 

 కొత్తపేట మండల తెలుగు యువత సమావేశం మండల తెలుగు యువత అధ్యక్షుడు ఇళ్ళ రాము అధ్యక్షతన శనివారం కొత్తపేటలో జరిగింది.. ఈ సందర్భంగా సంజీవ్ మాట్లాడుతూ యువత ఉపాధి కోసం కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఉన్నత విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు చేస్తున్న కృషి ప్రశంసనీయం అన్నారు...రాష్ట్రంలో విద్యా వ్యవస్థమెరుగుపడితే యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి...అందుకే ఆ దిశగా ఉన్నత విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు ప్రయత్నం చేస్తున్నారు.. రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలకు సమర్ధులైన విద్యావంతుల్ని వైస్ ఛాన్స్ లర్లుగా నియమించి పలువురు ప్రశంసలు పొందారు.. గత వైసిపి ప్రభుత్వం విద్యావ్యవస్థలో నియామకాలన్నీ రాజకీయ ప్రేరేపితంగా ఉండేవి.. నేడు ఆ వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా లోకేష్ పని తీరు ఉంది...ఇక పార్టీలో కష్టపడిన వారిని గుర్తించాలనేది పార్టీ సిద్దాంతం. తెలుగుదేశంపార్టీ అనేది ఒక వ్యవస్థ. మనం అందరం ఆ వ్యవస్థలో భాగం.ఎన్నికల్లో విజయం సాధించాలంటే పార్టీ సిద్ధాంతాలను బలంగాప్రజల్లోకి తీసుకెళ్లాలి. మనం కోరుకున్న మార్పు సాధ్యం కావాలంటేఅందరం కలిసికట్టుగా పనిచేయాలని సంజీవ్ కోరారు.సమావేశంలో కొత్తపేట నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు భావన శ్రీనివాస్, కొత్తపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గనిశెట్టి వీరేష్, ప్రధాన కార్యదర్శి కడలి భీమా తదితరులు పాల్గొన్నారు...