మండలంలోని జొన్నాడ గ్రామంలో శ్రీ వైట్ల చిన్న వెంకన్న(పెద్ద కళ్యాణ మండపం) వద్ద ఆదివారం శ్రీ నాగ సూర్య మెడికల్స్ (బిఎంపి) కొవ్వూరి అనిల్ రెడ్డి, అలాగే సత్య క్లినికల్ లేబరేటరీ(ల్యాబ్ టెక్నీషియన్) తాతపూడి సత్య నాగేంద్ర ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గ్రామ నాయకులు పాల్గొని ఈ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.రావులపాలెం కేకే హాస్పటల్ అండ్ డయాబెటిక్ కేర్ డాక్టర్ పీజీ ఖాశీం ఖాన్ తమ సిబ్బందితో కలిసి వైద్య సేవలను అందించారు.షుగర్,బిపి,గుండె,ఊపిరితిత్తులు,కిడ్నీ, మెదడు,కిళ్లు, గ్యాస్ట్రిక్, చర్మ వ్యాధులు, విష జ్వరములు మొదలగు అన్ని రకముల వ్యాధులకు చికిత్సను అందించగా సుమారు 200 మంది రోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు.అలాగే అవసరమైన వారికి ఉచితంగా ఈసీజీ, రక్త పరీక్షలు నిర్వహించి,మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.