రమజాన్ కు స్వాగతం... మసీదులు ముస్తాబు ఈ నెల 19 నుండి పవిత్ర రమజాన్ ఉపవాస దీక్షలు ఆరంభం...


 రమజాన్ కు స్వాగతం...

మసీదులు ముస్తాబు...

ఈ నెల 19 నుండి పవిత్ర రమజాన్ ఉపవాస దీక్షలు ఆరంభం...


ముస్లిం లు అత్యంత పవిత్రం భావించే రంజాన్ మాసం  ఈ నెల 19 నుండి ప్రారంభం కానుంది. ఈ నెల 18 బుధవారం సాయంత్రం చంద్రదర్శనం తో ఈ పవిత్ర నెల ఆరంభం అవుతుంది. బుధవారం రాత్రి ఈషా నమాజ్ తరవాత తరావి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఈ నెల 19 గురువారం తెల్లవారుజామున తొలి ఉపవాస దీక్ష ఆరంభిస్తారు. తెల్లవారు జామున నుండి సూర్య అస్తమయం వరకు దీక్ష చేస్తారు. ప్రతి రోజూ రాత్రి  ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ఇలా నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు కొనసాగుతాయి. వచ్చే నెల చంద్రదర్శనం

తరవాతి రోజు రంజాన్ పండుగ ఈదుల్ ఫితర్ నిర్వహిస్తారు. ఈ నెల రోజుల ముస్లిం లు అత్యంత భక్తి శ్రద్ధ లతో ఉపవాసం ఆచరిస్తారు. దాన ధర్మాలు చేస్తారు. బీదలకు వస్త్రాలు, భోజనాలు ఏర్పాటు చేస్తారు. ధనవంతులు తమ సంపాదనలో రెండున్నర శాతం సొమ్ములు పేదలకు జకాత్ 

దానం చేస్తారు. 


మసీదులు ముస్తాబు...

మండపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న మసీదుల్లో రంజాన్ పండుగ సందర్భంగా ఆయా మసీదులను ముస్తాబు చేశారు. ప్రాచీన చరిత్ర గల మండపేట కలువ పువ్వు సెంటర్ లో ఉన్న హానఫీ అహలే సున్నత్ వల్ జామియా మస్జిద్ లో అన్ని ఏర్పాట్లు చేసినట్లు మస్జిద్ ప్రెసిడెంట్ ఎండి అతవుర్ రెహమాన్ తెలిపారు. మసీదు ను అందమైన విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు. సైదల్లి పేట లోని హజరత్ హంజా మస్జిద్, గాంధీనగర్ లోని అల్ అమీనా  మస్జిద్, విజయలక్ష్మి నగర్ లోని అక్సా మస్జిద్ లలో రంజాన్ 

ఏర్పాట్లు చేశారు. మసీదుల్లో విద్యుదీకరణ, 

పారిశుధ్య పనులు చేపట్టారు. ద్వారపూడి, కేశవరం, ఏడిద, అంగర, టేకి, రాయవరం మండలం లో మస్జిద్ లను ప్రత్యేకంగా అలకరించారు.